పశ్చిమగోదావరి జిల్లా , జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి గ్రామంలో ఆదివారం ఓ వివాహిత ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి , అనాదలుగా మారిన ఇద్దరు చిన్న పిల్లలు
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామానికి చెందిన జోనుబోయిన రాంబాబు భార్య మంగలక్ష్మి(25) ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుందని భర్త రాంబాబు (30) బంధువులకు సమాచార మిచ్చాడు. ఐతే సంఘటన స్థలానికి చేరుకున్న భంధువులు భర్తే హత్య చేసాడని పోలీసులకు తెలిపారు. భర్త రాంబాబు తరచూ మంగలక్ష్మి ని వేదిస్తూ, చెడు వ్యసనాలకు భానిసై డబ్బు కోసం భార్యను హింసించే వాడని, 6 నెలల క్రితం ఇద్దరు గొడవ పడగ పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లారు. భర్తే చంపి , ఆత్మ హత్య గా చిత్రీకరిస్తునాడని మృతురాలి తండ్రి సోమరాజు తెలిపాడు. వీరికి 4సంవత్సరాల క్రితం వివాహం కాగ వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.తల్లి చనిపోగా చంటి పిల్లలు అనాధలు కాగ వీరిని చుసిన వారంతా కన్నీటి పర్వంత మయ్యారు. పోలీసులు అనుమానస్పద మృతి కేసు గా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు